18 గంటలు బజ్జుంటా!

హాయ్‌.. బాగున్నారా. నా పేరు ఫెర్రెట్‌. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. మీరు నన్ను ఎప్పుడూ చూసి ఉండరు కదూ! అందుకే నా గురించి క్లుప్తంగా చెప్పిపోదామని ఇలా వచ్చా.పేరు: ముందే చెప్పాగా నా పేరు ఫెర్రెట్‌ అని!

Published : 08 May 2020 00:36 IST

నేనెవరో తెలుసా!

హాయ్‌.. బాగున్నారా. నా పేరు ఫెర్రెట్‌. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. మీరు నన్ను ఎప్పుడూ చూసి ఉండరు కదూ! అందుకే నా గురించి క్లుప్తంగా చెప్పిపోదామని ఇలా వచ్చా.
పేరు: ముందే చెప్పాగా నా పేరు ఫెర్రెట్‌ అని!
ముద్దుపేరు: నాకు ముద్దు పేరు లేదు. కానీ నాపేరుకు లాటిన్‌ భాషలో ‘చిన్నదొంగ’ అని అర్థం. అంటే నా అసలు పేరే నా ముద్దు పేరు అన్నమాట. మళ్లీ మాలో మగవాటిని హోబ్‌ అని, ఆడవాటిని జిల్‌ అనీ పిలుస్తుంటారు.
ప్రత్యేకత: నేను ఎక్కువగా న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటా. మేము అడవుల్లో ఉంటాం. కొన్ని చోట్ల మమ్మల్ని పెంపుడు జంతువుల్లానూ పెంచుకుంటారు. కొంతమంది కుందేళ్ల వేటకోసమూ మమ్మల్ని ఉపయోగిస్తుంటారు.
పరిమాణం: నేను నా తోకతో కలుపుకొని దాదాపు 50 సెంటీమీటర్ల పొడవుంటా. నా తోకేమో 13 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.

బరువు: దాదాపు 2కిలోలు
నిద్ర: రోజులో 14 నుంచి 18 గంటల వరకు నిద్రపోతా. అలా అని నేను సోమరి అనుకునేరు. నేను చాలా చురుగ్గా ఉంటా.
జీవితకాలం: అయిదు నుంచి తొమ్మిది సంవత్సరాలు
ఆహారం: చిన్న చిన్న జంతువుల్ని వేటాడి తినేస్తా. ఎలుకలు, కుందేళ్లను ఇష్టంగా హాంఁ ఫట్‌ చేస్తా.  
నేను మీకు ఈ విధంగా సాయపడతాను: ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ఫ్లూ వ్యాధులు మీ మనుషుల్లాగే మాకూ వ్యాపిస్తాయి. వీటి నివారణ కోసం మా మీద మీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రస్తుతం కరోనా నివారణ టీకాల కోసం కూడా మా మీద ప్రయోగాలు చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని