పసుపుతో పలకరిస్తారు!

నగరం: లీమాదేశం: పెరూవిస్తీర్ణం: 2672 చదరపు కిలోమీటర్లుజనాభా: దాదాపు 90 లక్షలు* లీమా... పెరూ దేశ రాజధాని. దక్షిణ అమెరికా ఖండంలోనే ఐదో అతిపెద్ద నగరం. దేశ వాణిజ్య కేంద్రం ఇదే.* పసిఫిక్‌ సముద్ర తీరంలో భలే అందంగా ఉంటుందిది. ఈ నగరంలో దాదాపు 80 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది.* స్పానిష్‌ సాహస యాత్రికుడు ఫ్రాన్సిస్కో పిజారో 1535లో ఈ నగరంలో మొదటిసారిగా కాలు మోపాడు. ఈ నగరాన్ని ‘ది సిటీ ఆఫ్‌ కింగ్స్‌’ అని పిలిచాడు....

Published : 05 Jan 2019 00:16 IST

మహా నగరం
లీమా

పసుపుతో పలకరిస్తారు!

నగరం: లీమా
దేశం: పెరూ
విస్తీర్ణం: 2672 చదరపు కిలోమీటర్లు
జనాభా: దాదాపు 90 లక్షలు
* లీమా... పెరూ దేశ రాజధాని. దక్షిణ అమెరికా ఖండంలోనే ఐదో అతిపెద్ద నగరం. దేశ వాణిజ్య కేంద్రం ఇదే.
* పసిఫిక్‌ సముద్ర తీరంలో భలే అందంగా ఉంటుందిది. ఈ నగరంలో దాదాపు 80 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది.
* స్పానిష్‌ సాహస యాత్రికుడు ఫ్రాన్సిస్కో పిజారో 1535లో ఈ నగరంలో మొదటిసారిగా కాలు మోపాడు. ఈ నగరాన్ని ‘ది సిటీ ఆఫ్‌ కింగ్స్‌’ అని పిలిచాడు.
* దక్షిణ అమెరికాను స్పానిష్‌ వాళ్లు పరిపాలించిన కాలంలో ఈ నగరమే రాజధానిగా ఉండేది. పెరూ దేశం 1821లో స్వాతంత్య్రం పొందాక లీమానే దేశ రాజధానిగా మారింది. ఇక్కడ 90 శాతం ప్రజలు స్పానిష్‌ మాట్లాడుతుంటారు.
* రకరకాల సంస్కృతుల వల్ల ఈ నగరంలో రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. చేపలతో చేసిన సెవిచై, లోమో సాల్టడో వంటివి ఇక్కడి ప్రత్యేకమైన వంటకాలు.


కొత్త సంవత్సరం!

పసుపుతో పలకరిస్తారు!

క్కడ కొత్త సంవత్సరం రోజున పసుపు రంగు దుస్తుల్ని వేసుకుంటారు. పసుపు రంగు పూలను కొంటారు. వేడుకల్లో ఈ రంగే ఎక్కువగా కనిపించేలా చూసుకుంటారట. ఎందుకంటే పసుపు రంగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తుంటారు ఇక్కడి ప్రజలు. డిసెంబరు 31 రాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే 12 ద్రాక్ష పండ్లు తింటారంతా. ఇక్కడి సంప్రదాయమిది.
* దేశదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారిక్కడకు. ఎన్నో మ్యూజియాలు, ప్రదర్శనలు, ఆర్ట్‌ గ్యాలరీలు, అడ్వెంచర్లు, ఆహ్లాదకరమైన సముద్ర తీరాలు, పండగలు, ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.


ఫౌంటేన్ల పార్కు!

పసుపుతో పలకరిస్తారు!

క్కడి పరక్‌ డె లా రిజర్వ్‌ పార్కు ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటేన్‌ కాంప్లెక్స్‌. ఇందులో బోలెడన్ని ఫౌంటేన్లు ఉంటాయి. ఈ పార్కులో అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా రకరకాల ఆకారాల్లో నీళ్లను చిమ్ముతున్న ఫౌంటేన్లు దర్శనమిస్తాయి. రాత్రివేళల్లో అయితే రంగు రంగుల్లో కనువిందు చేస్తుంటాయివి. 


రోజూ ముస్తాబే!

పసుపుతో పలకరిస్తారు!

సాధారణంగా ఏదైనా వేడుకకు పెంపుడు కుక్కల్ని రెడీ చేస్తారు. కానీ ఇక్కడి పెంపుడు కుక్కలు ఎప్పుడూ ముస్తాబుతోనే కనిపిస్తాయి. ఎంచక్కా చొక్కా, ప్యాంటూ, కళ్లజోడుతో చూడముచ్చటగా ఉంటాయి. 


నగరం పుట్టిన చోటు!

సందర్శకులు ఎక్కువగా తమ టూర్‌ని ఇక్కడి ప్లాజా మేయర్‌ నుంచి ప్రారంభిస్తుంటారు. లీమా నగరం పుట్టిన చోటుగా చెబుతుంటారు. వందలాది దుకాణాలు, రెస్టారెంట్లు ఉంటాయిక్కడ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని