నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: చింటూ.. ఏంటి ఈ మధ్య అంత సీరియస్‌గా ఉంటున్నావు? చింటు: నిజాయతీ పరులెప్పుడూ ఆవేశంగానే ఉంటారట కదా.. మా టీచర్‌ చెప్పింది.

Published : 15 Dec 2021 01:12 IST

అందుకా అంత కోపం!

అమ్మ: చింటూ.. ఏంటి ఈ మధ్య అంత సీరియస్‌గా ఉంటున్నావు?
చింటు: నిజాయతీ పరులెప్పుడూ ఆవేశంగానే ఉంటారట కదా.. మా టీచర్‌ చెప్పింది.

అమ్మ: అవునా.. అయితే!
చింటు: నేనూ నిజాయతీపరుణ్నే కదా.. అందుకే సీరియస్‌గా ఉంటున్నా.

అమ్మ: ఆఁ!!

 


ఏది నిజం?

పింకి: టీచర్‌.. మీరు ఒక్క మాట మీద నిలబడరెందుకు?
టీచర్‌: ఏంటి పింకీ.. ఒకేసారి అంత మాటన్నావ్‌?

పింకి: ఏం లేదు టీచర్‌.. మొన్నేమో ‘నవ్వు నాలుగు విధాల చేటు’.. అని చెప్పారు. నిన్ననేమో ‘నవ్వలేక పోవడం ఒక రోగం’ అన్నారు. ఇందులో ఏది నిజం?
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని