నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌ : కనక్‌.. పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు?

Published : 18 Feb 2022 00:58 IST

పెద్ద లక్ష్యమే!

టీచర్‌ : కనక్‌.. పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు?

కనక్‌ : నేను ఎంబీబీఎస్‌ చదివి, పోలీస్‌ అయ్యి.. మంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో లాయర్‌గా పనిచేస్తూ, సివిల్‌ ఇంజినీర్‌గా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి.. కలెక్టర్‌నయ్యి చివరగా ఎమ్మెల్యేగా రిటైరవుతా టీచర్‌.

టీచర్‌ : ఆ..!!


అవి పండ్లు కావు

మిన్ను : రాంకీ.. వచ్చే నెలలో నీ పుట్టినరోజు వస్తుంది కదా?

రాంకీ : హ.. అవును మిన్నూ.

మిన్ను : మరి, మీ నాన్నను ఏం గిఫ్టు అడిగావు?

రాంకీ : ఆపిల్‌ కానీ బ్లాక్‌బెర్రీ కానీ కొనివ్వమన్నా! 

మిన్ను : అసలే వచ్చేది ఎండాకాలం.. ఆపిల్‌, బ్లాక్‌బెర్రీ కాకుండా పుచ్చకాయ కొనివ్వమనకపోయావా?

రాంకీ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని