నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : పిల్లలూ.. నిన్న జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ జంతువు, జాతీయ పక్షి గురించి పాఠం విన్నారు కదా?

Published : 19 Mar 2022 00:38 IST

పెద్ద ప్రశ్నే!

టీచర్‌ : పిల్లలూ.. నిన్న జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ జంతువు, జాతీయ పక్షి గురించి పాఠం విన్నారు కదా?

విద్యార్థులు : ఓ.. విన్నాం టీచర్‌..

టీచర్‌ : అందులో మీకేమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే, ఒక్కొక్కరూ అడగండి!

విజ్జు : టీచర్‌ టీచర్‌.. నాదొక చిన్న డౌట్‌..

టీచర్‌ : ఏంటో చెప్పు విజ్జూ..

విజ్జు : జాతీయ గీతం పాడుతున్నప్పుడు.. జాతీయ జంతువు వస్తే ఏం చేయాలి టీచర్‌..?

టీచర్‌ : ఆ..!!

భలే మావయ్య..

రింకీ : ఏంటి టీనా.. మీ మావయ్య ఫోన్‌లో ఎవరినో బాగా కోప్పడుతున్నాడు?

టీనా : అవును రింకీ.. బయటకు వెళ్దామని ఫ్రెండ్‌ ఫోన్‌ చేస్తున్నాడు..

రింకీ : దానికి అంత కోపమెందుకు?

టీనా : మా మావయ్య అయిదు నిమిషాల్లో వస్తానని చెప్పినా.. ప్రతి పది నిమిషాలకోసారి ఫోన్‌ చేసి విసిగిస్తుంటేనూ..

రింకీ :ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని