నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అవును మరి!టింకు: అమ్మా.. నేను మంచి మనిషినయ్యాను తెలుసా!అమ్మ: అదేంటి.. ఎలా?

Updated : 08 Apr 2022 02:11 IST

అవును మరి!

టింకు: అమ్మా.. నేను మంచి మనిషినయ్యాను తెలుసా!

అమ్మ: అదేంటి.. ఎలా?

టింకు: ‘మంచి మనుషులకే ఈ పరీక్షలన్నీ’ అని మొన్న అమ్మమ్మ అందిగా..

అమ్మ: అవును.. అయితే..

టింకు: నాకు రేపటి నుంచి స్కూల్లో పరీక్షలమ్మా!

అమ్మ: ఆఁ!!


నిజమే మరి!

టీచర్‌: చింటూ.. నీ వయసెంత?

చింటు: ఎక్కడ టీచర్‌?

టీచర్‌: ఎక్కడ ఏంటీ? నేను ఏమడిగాను.. నువ్వేం చెబుతున్నావు?

చింటు: ఇంట్లో అయితే 9 సంవత్సరాలు టీచర్‌. స్కూల్లో, ఆధార్‌ కార్డులో అయితే 8, బస్సు, రైలు, సినిమా థియేటర్‌లలో అయితే 5 సంవత్సరాలే టీచర్‌!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని