Published : 31 May 2022 00:43 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...

నేను కూడా...

చింటు: టీచర్‌.. టీచర్‌.. నిన్న బంటీ క్లాసులోనే నిద్రపోయాడు టీచర్‌.
టీచర్‌: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు చింటూ...
చింటు: అప్పుడు నాకూ నిద్రవచ్చి.. నేనూ నిద్రపోయా టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


అందుకే మరి!

(ఒక వ్యక్తి గతంలో తనిచ్చిన డబ్బులు తీసుకోవడానికి తన ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి డోర్‌ బెల్‌ మోగిస్తాడు. అప్పుడు ఒక పిల్లాడు బయటకు వస్తాడు..)
వ్యక్తి: బాబూ.. మీ నాన్న ఇంట్లో ఉన్నారా?
బాబు: లేడు అంకుల్‌. నాన్న ఆఫీస్‌కు వెళ్లారు.
వ్యక్తి: పోనీ మీ అన్నయ్య అయినా ఉంటాడు కదా. కాస్త పిలువు.
బాబు: లేడంకుల్‌.. అన్నయ్య కూడా క్రికెట్‌ ఆడుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్లాడు.
వ్యక్తి: కనీసం మీ అమ్మగారినైనా పిలువు బాబు.
బాబు: అమ్మ రైతుబజార్‌కు వెళ్లింది అంకుల్‌.
(ఈ మాటలు వినగానే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి...)

వ్యక్తి: మరి నువ్వెందుకు ఇంట్లో ఉన్నావ్‌. నువ్వు కూడా ఎటైనా వెళ్లకపోయావా?
బాబు: అందుకేగా అందరూ వెళ్లిపోయారని.. నేను ఇక్కడికి వచ్చింది. ఇది మా ఫ్రెండ్‌ ఇల్లు అంకుల్‌.


ఇదీ నిజమేగా!

టీచర్‌: టిప్పు సుల్తాన్‌ ఏ యుద్ధంలో చనిపోయాడు. టింకూ.. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు?
టింకు: ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని