నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటి: చింటూ.. ఇప్పుడు చూడు ఆ హీరో గుర్రం మీద నుంచి పడతాడు.

Published : 05 Jun 2022 00:19 IST

మొన్న కూడా..

చంటి: చింటూ.. ఇప్పుడు చూడు ఆ హీరో గుర్రం మీద నుంచి పడతాడు.
చింటు: అస్సలు పడడు. వంద రూపాయలు పందెం.

చంటి: చింటూ.. చూశావా.. అదిగో హీరో పడ్డాడు. సరే నాకు వంద రూపాయలు ఇవ్వవద్దులే.
చింటు: ఏ.. ఎందుకు?

చంటి: నేను ఈ సినిమా నిన్ననే చూశాను.
చింటు: నేనైతే ఈ మూవీ మొన్నే చూశా తెలుసా.

చంటి: మరి హీరో పడతాడని నీకు తెలియదా? అలా ఎలా పందెం కాశావు?  
చింటు: తెలుసు.. మొన్న పడ్డాడు కదా.. ఈసారైనా జాగ్రత్తగా గుర్రం నడుపుతాడు అనుకున్నా.. ప్చ్‌.. కానీ ఇప్పుడూ పడిపోయాడు.
చంటి: ఆఁ!!

రాయమంటే.. తాగేశారు! 

టీచర్‌ : హిమజా.. రెస్టరంట్‌ స్పెల్లింగ్‌ రాయమంటే, రెండు ‘గి’లు ఎగరగొట్టేశావేంటి?
హిమజ : ఒక ‘గి’ నేనూ, మరో ‘గి’ మా చెల్లీ తాగేశాం టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని