Updated : 20 Jun 2022 05:21 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌...!

అలవాట్లో పొరపాటు!

టీచర్‌: ఏంటి చింటూ.. క్లాస్‌కు బియ్యం బస్తా తెచ్చావ్‌?
చింటు: సారీ టీచర్‌. కంగార్లో స్కూల్‌బ్యాగ్‌ అనుకుని మోసుకొచ్చా.. కానీ అదేం విచిత్రమో పెద్దగా బరువేం అనిపించలేదు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

మా నాన్నను చూసి...

టీచర్‌: బంటీ.. నిన్ను క్లాస్‌లో ఎవరు ఏమన్నా.. తిరిగి నువ్వు ఒక్క మాట కూడా అనవే. నీకు ఇంత చిన్న వయసులో అంత సహనం, ఓర్పు ఎలా వచ్చాయి.
బంటి: మా అమ్మ ఎన్ని మాటలన్నా.. మా నాన్న తిరిగి ఒక్కటంటే ఒక్కమాటా అనరు టీచర్‌. ఆ సహనం, ఓర్పు.. నేను మా నాన్నను చూసే నేర్చుకున్నా టీచర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు