నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఎన్నిసార్లు చెప్పాలి నీకు చింటూ.. ‘ఆలస్యం అమృతం విషం’ అని! ఎప్పుడూ బద్ధకంగా ఉంటానంటే ఎలా?

Published : 14 Sep 2022 01:18 IST

ఏం బుర్రో!

టీచర్‌: ఎన్నిసార్లు చెప్పాలి నీకు చింటూ.. ‘ఆలస్యం అమృతం విషం’ అని! ఎప్పుడూ బద్ధకంగా ఉంటానంటే ఎలా?

చింటు: సారీ టీచర్‌. నాకో చిన్న డౌట్‌.. మనదగ్గర అమృతం ఉంటేనే కదా.. ఆలస్యం చేస్తే అది విషంగా మారేది. మన దగ్గర అమృతం లేనప్పుడు ఆలస్యం అయితే ఎందుకు ఇబ్బంది?

టీచర్‌:ఆఁ!!


తాతయ్య చెప్పారులే!

నాన్న: నేను చిన్నప్పుడు ఎంత బాగా చదివేవాడినో తెలుసా...!

బంటి: తెలుసు నాన్నా... నిన్నే తాతయ్య మీ చదువు సంగతులు చెప్పారు. ప్రోగ్రెస్‌ రిపోర్టులు కూడా చూపించారు. ఒక్కదాంట్లోనూ పాస్‌ మార్కులు రాలేదుగా!

నాన్న: మరీ.. అదీ!


అంత ఖాళీ మాకెక్కడిది!

టీచర్‌: న్యూటన్‌ ఆపిల్‌ చెట్టు కింద కూర్చొని భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టారు. మీరూ ఉన్నారు... మీకసలు పరిశీలన శక్తే లేదు.

కిట్టు: మీరు ఇచ్చిన హోం వర్క్‌లు చేయడానికే మాకు సమయం సరిపోవడం లేదు. ఉన్న శక్తంతా దీనికే ఖర్చయిపోతోంది. ఇక మాకు పరిశీలన శక్తి ఎక్కడ నుంచి వస్తుంది టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని