నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అవును.. అనుకోరూ.. టీచర్‌ : హరీ, గిరీ.. ఇద్దరూ ఎందుకలా పరీక్ష హాల్లో గొడవపడుతున్నారు?

Published : 26 Nov 2022 00:12 IST

అవును.. అనుకోరూ..

టీచర్‌ : హరీ, గిరీ.. ఇద్దరూ ఎందుకలా పరీక్ష హాల్లో గొడవపడుతున్నారు?

హరి : వాడు ఖాళీ పేపర్‌ ఇచ్చాడు టీచర్‌..

టీచర్‌ : తను ఏమీ రాయకుండా ఖాళీ పేపర్‌ ఇస్తే నీకేమైంది?

హరి : నేను కూడా ఏమీ రాయకుండా ఖాళీ పేపరే ఇచ్చాను. అది చూస్తే.. నేను కాపీ కొట్టానని మీరు అనుకోరూ..

టీచర్‌ : ఆ..!!

నిజంగా బెదిరింపులే..!

పింకి : నాన్నా నాన్నా.. బామ్మ ఫోన్‌కి రోజూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి..

నాన్న : అవునా.. ఏమని?

పింకి :  మీ ప్లాన్‌ గడువు ముగిసింది.. రీఛార్జి చేసుకోకపోతే ముందు అవుట్‌గోయింగ్‌, తర్వాత ఇన్‌కమింగ్‌ కట్‌ చేస్తామని..

నాన్న : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని