నవ్వుల్‌... నవ్వుల్‌..!

అంకుల్‌ : ఏంటి చింటూ.. చాలా కోపంగా ఉన్నావు?

Updated : 30 Jun 2023 01:12 IST
అంతేనా..!
అంకుల్‌ : ఏంటి చింటూ.. చాలా కోపంగా ఉన్నావు?
చింటు : మన వీధి చివరనున్న దుకాణ యజమాని నన్ను మోసం చేశారు అంకుల్‌..
అంకుల్‌ : అవునా.. ఏం జరిగింది?
చింటు : కొత్త సబ్బు వచ్చిందని, అందులో శరీరానికి మంచి చేసే రకరకాల ఔషధాలు ఉన్నాయన్నారు.. తీరా ఇంటికొచ్చి ఆ సబ్బుతో స్నానం చేస్తే, నురగ తప్ప అందులో ఏమీ లేదు అంకుల్‌..
అంకుల్‌ : ఆ..!!
కొట్టరా మరి?
బామ్మ : పింకీ.. ఎందుకు ఏడుస్తున్నావు?
పింకి : అమ్మ కొట్టింది..
బామ్మ : అవునా.. ఎందుకు?
పింకి : కుళాయిలో నీళ్లు ఎన్ని ఉన్నాయో చూద్దామని విప్పి పెట్టా.. అంతే.. పరుగెత్తుకుంటూ వచ్చి మరీ కొట్టింది అమ్మ..
బామ్మ : ఆ..!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని