నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ : ఏంట్రా.. దేవుడికి అంతసేపు దండం పెడుతున్నావు?

Updated : 06 Jul 2023 02:11 IST

ఆ ఒక్కటి చాలు..

అమ్మ : ఏంట్రా.. దేవుడికి అంతసేపు దండం పెడుతున్నావు?

సూరి : దేవుడిని ఎందుకు ఊరకే ఇబ్బంది పెట్టడమని ఒకటే కోరిక కోరుకున్నానమ్మా..

అమ్మ : అవునా.. ఏంటది?

సూరి : దేవుడి మహిమలన్నీ నాకు ఇచ్చేయమని..

అమ్మ : ఆ..!!

వస్తే కదా..!

అంకుల్‌ : ఏంటి విజయ్‌.. దిగాలుగా కనిపిస్తున్నావు?

విజయ్‌ : అవును అంకుల్‌..

అంకుల్‌ : ఏంటో చెప్పు?

విజయ్‌ : త్వరత్వరగా తెలుగులో నా ఆత్మకథను రాసేద్దామంటే.. ఎంత ప్రాక్టీస్‌ చేసినా అ, ఆలు ఓ పట్టాన రావడం లేదు..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని