నవ్వుల్‌... నవ్వుల్‌..!

Published : 07 Jul 2023 00:51 IST

ఒకటోసారి..

కిరణ్‌ : మీ మావయ్య అంత పెద్ద గాయకుడా?

చరణ్‌ : అదేంటి.. ఎవరు చెప్పారు?

కిరణ్‌ : మీ మావయ్య పాటలు బాగా పాడతాడని నిన్న క్లాసులో చెప్పావు కదా..  

చరణ్‌ : ఓహో.. అదా.. అవి వేలం పాటలు లే..

కిరణ్‌ : ఆ..!!

సర్దేశాడు..!

అమ్మ : అదేంటి చంటీ.. స్కూల్‌ నుంచి మధ్యలోనే వచ్చేశావు?

చంటి : నా పక్క బెంచీలో కూర్చొనే కిట్టూ నాకు నచ్చలేదమ్మా..

అమ్మ : ఒకే తరగతి వాళ్లంతా స్నేహితుల్లా సర్దుకుపోవాలి కానీ ఇలా నచ్చడం, నచ్చకపోవడం అని ఉండకూడదు..

చంటి : అందుకేనమ్మా.. బ్యాగ్‌ సర్దుకొని ఇంటికొచ్చేశా..

అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని