నవ్వుల్‌... నవ్వుల్‌..!

విహారి : లహరీ.. మీ హోటల్‌లో పనిచేసే వ్యక్తిని తీసేశారట?

Updated : 14 Jul 2023 01:54 IST

తెలిసిపోయింది మరి..

విహారి : లహరీ.. మీ హోటల్‌లో పనిచేసే వ్యక్తిని తీసేశారట?

లహరి : అవును.. మానాన్నే వెళ్లిపొమ్మన్నారు..

విహారి : ఎందుకు?

లహరి : టిప్‌లన్నిటితో ఏం చేస్తారని ఓ కస్టమర్‌ అడిగితే.. మంచి హోటల్‌కెళ్లి భోజనం చేస్తానని చెప్పాడట..

విహారి : ఆ..!!

అవును నిజమే.!

టిల్లు : అమ్మా అమ్మా.. నేనిప్పుడే ఒక విషయం కనిపెట్టానమ్మా..

అమ్మ : ఏంటది?

టిల్లు : కాలితో మనల్ని మనం తన్నుకోవడం కన్నా.. పక్క వాళ్లను తన్నడం చాలా ఈజీ..

అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని