నవ్వుల్‌... నవ్వుల్‌..!

నిజంగా అద్భుతమే..

Published : 29 Jul 2023 00:07 IST

నిజంగా అద్భుతమే..

రాకీ : అమ్మా అమ్మా.. నీకో శుభవార్త మోసుకొచ్చానమ్మా..
అమ్మ : కొంపదీసి అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యావా ఏంటి?
రాకీ : నేను శుభవార్త అన్నాను కానీ అద్భుతమని చెప్పానా?
అమ్మ : ఆ..!!


వెరీ సింపుల్‌..

టీచర్‌ : పిల్లలూ.. మిల్లీమీటర్లను మీటర్లుగా ఎలా మారుస్తారో తెలుసా?
లిల్లి : నాకు తెలుసు టీచర్‌..
టీచర్‌ : వెరీగుడ్‌.. నిలబడి అందరికీ వినిపించేలా చెప్పు?
లిల్లి : ‘మిల్లీ’ని తీసేస్తే సరిపోతుంది టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


నిజమే కదా.!

టీచర్‌ : రవీ.. నీ ఆన్సర్‌ షీట్‌ ఖాళీగా ఉందేంటి?
రవి : కొన్ని ప్రశ్నలకు మౌనమే అత్యుత్తుమ సమాధానమన్నారు కదా టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని