నవ్వుల్‌... నవ్వుల్‌..!

నాన్నకు ప్రేమతో...

Published : 02 Aug 2023 00:04 IST

నాన్నకు ప్రేమతో...

టీచర్‌:  ఏంటి రవీ.. అప్లికేషన్‌ ఫారంలో మీ నాన్న పేరు నిలువుగా రాశావు?

రవి: ఏం లేదు టీచర్‌.. మా నాన్న ఎప్పుడూ నాతో ఓ మాట చెబుతుంటారు.

టీచర్‌: ఏంటా.. మాట?

రవి: తన పేరు నిలబెట్టమని.. అందుకే మా నాన్న పేరు నిలువుగా రాశాను టీచర్‌..  

టీచర్‌: ఆఁ!!

దేవుడా... ఓ మంచి దేవుడా!

అమ్మ: కిట్టూ..! పరీక్షకు వెళ్తూ దేవుడికి దండం పెట్టుకున్నావా..?

కిట్టు: హా.. పెట్టుకున్నానమ్మా..!

అమ్మ: ఏం కోరుకున్నావు..?

కిట్టు: ఒకవేళ నేను పరీక్షలో ఫెయిల్‌ అయితే, నాతో పాటు నా పక్కన కూర్చునే చింటు కూడా ఫెయిల్‌ అవ్వాలనమ్మా..!

అమ్మ: ఆఁఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని