నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌ : పిల్లలూ.. మనుషులకు రకరకాల బ్లడ్‌ గ్రూపులు ఎందుకుంటాయో తెలుసా?

Published : 03 Aug 2023 00:13 IST

అందుకోసమా..?
టీచర్‌ : పిల్లలూ.. మనుషులకు రకరకాల బ్లడ్‌ గ్రూపులు ఎందుకుంటాయో తెలుసా?
విమల : నాకు తెలుసు టీచర్‌..
టీచర్‌ : వెరీగుడ్‌.. ఎందుకో చెప్పు?

విమల : ఎప్పుడూ ఒకటే రకం తాగితే దోమలకు బోరు కొడుతుందనీ..
టీచర్‌ : ఆ..!!

ఎంచక్కా ఈత కొట్టొచ్చు..
హరి : గిరీ.. మీ మావయ్య అంటే నీకు చాలా ఇష్టమని చెబుతుంటావు కదా.?
గిరి : అవును..

హరి : ఎందుకంత ఇష్టం?
గిరి : మా మావయ్య వాళ్ల కొత్తింట్లో నీళ్లున్న స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు నాలాంటి ఈత రాని వాళ్ల కోసం నీళ్లు లేని స్విమ్మింగ్‌ పూల్‌ కూడా కట్టించాడు మరి..

హరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని