నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : కిట్టూ.. ఆన్సర్‌ షీట్‌లో ఏమీ రాయకుండా ఖాళీగా ఇచ్చావేంటి?

Published : 05 Aug 2023 02:14 IST

ఎంత జాగ్రత్తో.!!

టీచర్‌ : కిట్టూ.. ఆన్సర్‌ షీట్‌లో ఏమీ రాయకుండా ఖాళీగా ఇచ్చావేంటి?

కిట్టు : నా జవాబులు ఎవరైనా కాపీ కొడతారేమోనని జాగ్రత్త పడ్డాను టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

ఈ పెద్దవాళ్లున్నారే...

వరుణ్‌ : ఏంటి అరుణ్‌.. ఎందుకు ఏడుస్తున్నావు?

అరుణ్‌ : ఈ పెద్దవాళ్లేంటో.. అసలే అర్థం కారు..

వరుణ్‌ : ఇంతకీ ఏమైందో చెప్పు?

అరుణ్‌ : షవర్‌ కింద స్నానం చేసేసి త్వరగా రమ్మని రోజూ చెప్పే అమ్మ.. ఈరోజు నేను వర్షంలో స్నానం చేస్తే తిట్టింది రా.. అది కూడా షవరే కదా..!!

వరుణ్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని