నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Updated : 08 Aug 2023 06:20 IST

భలే ప్రాక్టీస్‌..

అమ్మ : ఏంట్రా టింకూ.. హోంవర్క్‌ రాసుకుందామని మీ ఫ్రెండ్‌ కిట్టూని రమ్మని చెప్పి.. తన పుస్తకంలో చూసి రాస్తున్నావేంటి?

టింకు : మరేం లేదమ్మా.. చూసి రాయడం ఇప్పుడు రోజూ ప్రాక్టీస్‌ చేస్తే.. పరీక్షల్లో పని తేలికవుతుందనీ..

ఇంపోజిషన్‌ మరి..

విహారి : ఏంటి లహరీ.. వారం నుంచి రోజూ లంచ్‌ బాక్స్‌లో బెండకాయ కూరే తీసుకొస్తున్నావు?

లహరి : అదా.. ఒకరోజు బెండకాయ కూరలో అమ్మ ఉప్పు తక్కువ వేసిందని, పది రోజుల పాటు అదే కూర వండమన్నారు మా నాన్న..

విహారి : ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు?

లహరి : స్కూళ్లో టీచర్‌..

విహారి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని