నవ్వుల్‌.. నవ్వుల్‌.!

కలిపి చెప్తే అంతే..!

Published : 20 Aug 2023 00:07 IST

కలిపి చెప్తే అంతే..!

టీచర్‌: బంటీ.. నేను చెప్పిన రెండు వాక్యాలనూ కలిపి మరో వాక్యంగా చెప్తావా..?
బంటి: చెప్తాను టీచర్‌..
టీచర్‌: ‘నేను సైకిల్‌ మీద స్కూల్‌కు వచ్చాను’, ‘నేను దెయ్యాన్ని చూశాను’..
బంటి: నేను సైకిల్‌ మీద దెయ్యాన్ని చూశాను..!
టీచర్‌: ఆఁ..!


రాకపోవడం వల్లే..!

టీచర్‌: కిట్టూ.. నీకు పరీక్షల్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి?
కిట్టు: పరీక్షకు హాజరు కాకపోవడం వల్ల టీచర్‌..
టీచర్‌: నువ్వు అన్ని పరీక్షలకు వచ్చావు కదా..!
కిట్టు: నేను కాదు టీచర్‌.. నా పక్కన కూర్చునే చంటి రాలేదు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని