నవ్వుల్‌... నవ్వుల్‌..!

విహారి : లహరీ.. మేము నిన్న షాపింగ్‌ మాల్‌కు వెళ్లాం కదా.. 

Published : 26 Aug 2023 00:50 IST

అబ్బో..

విహారి : లహరీ.. మేము నిన్న షాపింగ్‌ మాల్‌కు వెళ్లాం కదా..  
లహరి : హ అవును..
విహారి : మేం లిఫ్ట్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ పోవడంతో చాలాసేపు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది తెలుసా..?
లహరి : మీరు కాస్త నయం.. గత వారం మేమెళ్లినప్పుడు కూడా కరెంట్‌ పోయింది.. దాదాపు గంటసేపు ఎస్కలేటర్‌ పైనే ఉండిపోయాం మరి..
విహారి : ఆ..!!

కనిపించదు టీచర్‌..!

టీచర్‌: బంటీ.. వెంటనే నాకు బాక్టీరియా బొమ్మ గీసి చూపించు..!
బంటి: అలాగే టీచర్‌.. ఇదిగోండి గీసేసా..
టీచర్‌: అదేంటి బంటీ.. కనిపించట్లేదు..?
బంటి: మొన్న మీరే చెప్పారు కదా టీచర్‌.. బాక్టీరియా కంటికి కనిపించదనీ..  
టీచర్‌: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని