నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: కిట్టూ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్తావా..?

Updated : 02 Sep 2023 05:31 IST

అవును కదా..!

చింటు: కిట్టూ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్తావా..?

కిట్టు: హా.. చెప్తాను చింటూ..

చింటు: పచ్చగా ఉండే ఆహారం తింటే కళ్లకు మంచిదంటారు.. నిజమేనా?

కిట్టు: మంచిదే..

చింటు: ఎలా చెప్పగలవు?

కిట్టు: ఆవులు, గేదెలు కళ్లద్దాలు పెట్టుకోవడం మనం ఎప్పుడూ చూడలేదు కదా..

చింటు: ఆఁ..!

పెద్ద పదం..!

టీచర్‌: బంటీ.. ఇంగ్లిష్‌లో నీకు తెలిసిన పెద్ద పదం ఏంటో చెప్పు?

బంటి: ‘SMILES’ టీచర్‌..

టీచర్‌: అదెలా?

బంటి: మొదటి, చివరి అక్షరాల మధ్యలో ‘MILE’ ఉంది కదా టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని