నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటీ.. నేను ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెప్తావా?

Published : 06 Sep 2023 00:31 IST

ఒకే ఒక ప్రశ్న..!

టీచర్‌: బంటీ.. నేను ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెప్తావా?

బంటి: చెప్తాను టీచర్‌..

టీచర్‌: రాత్రి, పగలు ఈ రెండిట్లో ఏది ముందు వస్తుంది?

బంటి: పగలు టీచర్‌..

టీచర్‌: ఎలా చెప్పావు?

బంటి: మీరు ఒక ప్రశ్నే అడుగుతానన్నారు టీచర్‌..

టీచర్‌: ఆఁ..!

అంతే కదా..!

చంటి: చింటూ.. భూమి గుండ్రంగా ఉందనడానికి ఏవైనా రెండు సాక్ష్యాలు చెప్పగలవా?

చింటు: తప్పకుండా చంటీ..!

చంటి: అయితే చెప్పు చింటూ..!

చింటు: ఇప్పుడు నువ్వు చెప్పావు భూమి గుండ్రంగా ఉంటుందని! అలాగే మన పాఠ్య పుస్తకంలోనూ  ఉంది కదా..!!

చంటి: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని