నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : టిల్లూ.. కష్టం అంటే ఏంటో తెలుసా?

Published : 07 Sep 2023 00:02 IST

ఎన్ని కష్టాలో.?

టీచర్‌ : టిల్లూ.. కష్టం అంటే ఏంటో తెలుసా?

టిల్లు : తెలుసు టీచర్‌..

టీచర్‌ : ఏంటో చెప్పు?

టిల్లు : రాత్రంతా వర్షం పడి, ఉదయాన్నే స్కూల్‌కెళ్లే సమయానికి ఆగిపోవడం..

టీచర్‌ : మరి అష్టకష్టాలు అంటే..?

టిల్లు : స్కూల్‌కెళ్లగానే మళ్లీ వర్షం పడటం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


భలే భలే..

హరి : ఏంటి గిరీ.. మీ నాన్న స్వీటూ హాటూ పంచుతున్నారు?

గిరి : నేను అయిదో తరగతి పాసయ్యానని స్వీటు పంచుతున్నారు.. అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులే వచ్చాయి కాబట్టి హాటు ఇస్తున్నారు..

హరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని