నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 17 Sep 2023 00:11 IST

మర్చిపోయా..!

టీచర్‌: చిన్నీ.. హోంవర్క్‌ చేయకపోతే స్కూల్‌కు రావొద్దని చెప్పా కదా?

చిన్నీ: హోంవర్క్‌ చేయడం మర్చిపోయాను టీచర్‌..

టీచర్‌: మరి స్కూల్‌కు వచ్చావు?

చిన్నీ: అది కూడా మర్చిపోయాను టీచర్‌.. మా అమ్మే పొద్దున్నే నిద్రలేపి గుర్తు చేసింది..

టీచర్‌: ఆఁ..!

ఏంటా పని..?

కిట్టు: బంటీ.. నేనో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా?

బంటి: చెప్తాను కిట్టూ..!

కిట్టు: నువ్వు మాత్రమే చేయగలిగింది, ఇంకెవ్వరూ చేయలేని పని ఏదైనా ఉందా?

బంటి: హో.. ఎందుకు లేదు.! నేను రాసిన నోట్స్‌ చదవడం నాకు తప్ప, ఎవరికీ సాధ్యం కాదు..

కిట్టు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని