నవ్వుల్‌... నవ్వుల్‌...!

బంటి: కిట్టూ.. ఈ రోజు కొశ్చన్‌ పేపర్‌ ఎలా వచ్చింది?

Published : 30 Sep 2023 01:43 IST

అంతే కదా..!

బంటి: కిట్టూ.. ఈ రోజు కొశ్చన్‌ పేపర్‌ ఎలా వచ్చింది?

కిట్టు: ఎప్పటిలాగే ప్రశ్నలతో నిండి వచ్చింది బంటీ..

బంటి: అలా కాదు కిట్టూ.. ఎలా ఉందని అడుగుతున్నా?

కిట్టు: తెల్లని పేపర్‌ మీద నల్లని అక్షరాలతో..

బంటి: ఆఁ..!

మ్యాప్‌లో ఉంది..!

టీచర్‌: చింటూ.. ఇలా వచ్చి మ్యాప్‌లో అమెరికా ఎక్కడుందో చూపించు?

చింటు: అలాగే టీచర్‌..

టీచర్‌: వెరీ గుడ్‌ చింటూ.. కరెక్టుగా చూపించావు.. ఇప్పుడు చెప్పండి పిల్లలూ.. అమెరికా ఎక్కడుంది?

విద్యార్థులు: మ్యాప్‌లో టీచర్‌..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని