నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 04 Oct 2023 00:09 IST

అందుకే తెచ్చా..!

నాన్న : ఏంటి చింటూ.. స్కూల్లో ఉండాల్సిన కుర్చీని ఇంటికి తెచ్చావు?

చింటు: అంటే నాన్నా.. మా టీచర్‌  ‘టేక్‌ యువర్‌ సీట్‌’ అన్నారు..

నాన్న : అయితే..?

చింటు: అందుకే తీసుకొని వచ్చేశా..!

అంతేగా..!

చంటి: బంటీ.. నేను ఓ ఫొటో చూపించి ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెబుతావా?

బంటి: హా.. నువ్వు ముందు చూపించు చంటీ..

చంటి: ఇందులో ఉన్న పులి, పిల్లిలో ఏది పెద్దదో చెప్పు?

బంటి: నువ్వు ముందు వాటి ‘డేట్‌ ఆఫ్‌ బర్త్‌’ చెప్పు.. అప్పుడు చెబుతా..!

చంటి: ఆఁ..!

ప్రాక్టీస్‌ మరి..

నాన్న: పవన్‌.. బయట కనిపించిన వారినల్లా కాలితో తన్నాలని చూస్తున్నావట.. ఏంటా పిచ్చి పని?

పవన్‌ : నేను తన్నడం లేదు నాన్నా.. ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నానంతే..

నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని