నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చింటూ.. అంతలా ఆలోచిస్తున్నావు?

Published : 07 Oct 2023 00:29 IST

ఎందుకు కొట్టింది..?

బంటి: ఏంటి చింటూ.. అంతలా ఆలోచిస్తున్నావు?

చింటు: మరేం లేదు బంటీ.. నువ్వు చిన్నప్పుడు ‘చిట్టి చిలుకమ్మా.. అమ్మ కొట్టిందా..?’ పాట విన్నావా?

బంటి: హా.. విన్నాను.. ఇప్పుడు అదెందుకు?

చింటు: అందులో చిలుకను వాళ్లమ్మ ఎందుకు కొట్టిందా.. అని ఆలోచిస్తున్నా బంటీ..

మీరే చెప్పారుగా..!

టీచర్‌: పిల్లలూ.. పరీక్ష రాయమంటే మీరంతా ఒకచోట కూర్చొని

ఏం చేస్తున్నారు?

విద్యార్థులు: మీరు చెప్పినట్లే పరీక్ష రాస్తున్నాం టీచర్‌..

టీచర్‌: అయితే దూరం దూరంగా కూర్చోవాలి కదా..?

విద్యార్థులు: అంటే.. ‘ఐకమత్యమే మహాబలం’ అని మొన్న మీరే చెప్పారు కదా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని