నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: ఏంటి కిట్టూ.. మ్యాథ్స్‌ పుస్తకాన్ని పట్టుకుని అలా చూస్తున్నావు?

Published : 12 Oct 2023 00:42 IST

ఎలా ఉంటుంది..!

బంటి: ఏంటి కిట్టూ.. మ్యాథ్స్‌ పుస్తకాన్ని పట్టుకుని అలా చూస్తున్నావు?
కిట్టు: మరేం లేదు బంటీ.. అది మాట్లాడితే ఎలా ఉంటుందా అని..?
బంటి: అందులో ఉన్న లెక్కలనే మనం చేయలేకపోతున్నాం.. ఇక అది మాట్లాడితే ఇంకేమైనా ఉందా..?

కిట్టు: ఆఁ..!


నాన్న చెప్పారు..!

టీచర్‌: చంటీ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబుతావా?
చంటి: చెబుతాను టీచర్‌..
టీచర్‌: అయిదు వందల్లోంచి రెండొందల ఎనభైని తీసివేస్తే ఎంతో చెప్పు?

చంటి: నేను తీయలేను టీచర్‌..
టీచర్‌: అదేంటి చంటీ..?

చంటి: మా నాన్న దేంట్లోంచి ఏమీ తీయకూడదని చెప్పారు టీచర్‌..
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని