నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 13 Oct 2023 00:07 IST

నిజమేగా..!

చంటి: ఏంటి బంటీ.. బాల్‌ని గాల్లో విసురుతూ అలా ఆలోచిస్తున్నావు?

బంటి: మరేం లేదు చంటీ.. ఎన్నిసార్లు విసిరినా అది మళ్లీ వెనకకు ఎలా వస్తుందోనని..

చంటి: దాన్ని పట్టుకోవడానికి గాల్లో ఎవరూ లేరు కాబట్టి..

బంటి: ఆఁ..!

ఇంటికి పంపిస్తారు కదా..!

టీచర్‌: కిట్టూ.. హోంవర్క్‌ చేయకుండా వచ్చావేంటి?  

కిట్టు: ఈరోజు మా అమ్మ ఊరెళ్తుంది టీచర్‌..

టీచర్‌: అయితే ఏంటి?

కిట్టు: హోంవర్క్‌ చేయకపోతే మీరు ఇంటికి పంపిస్తానన్నారు కదా.. అప్పుడు నేనూ అమ్మతో కలిసి ఊరెళ్లొచ్చని టీచర్‌..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని