నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 14 Oct 2023 00:03 IST

ఎక్కడో తెలుసా..?

చింటు: బంటీ.. నిన్నో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా?
బంటి: చెబుతాను చింటూ.. అడుగు..
చింటు: మొదటిసారి క్రికెట్‌ ఎక్కడ ఆడారో తెలుసా?
బంటి: తెలుసు.. మైదానంలోనే కదా..!
చింటు: ఆఁ..!


అందుకే టీచర్‌..!

టీచర్‌: కిట్టూ.. నీకు అయిదు మార్కులే వచ్చాయని తెలుసా?
కిట్టు: తెలుసు టీచర్‌..!
టీచర్‌: అయినా ఏమాత్రం బాధ లేకుండా అల్లరి చేస్తున్నావేంటి?
కిట్టు: నేను రాసిన జవాబులకు అవి కూడా వస్తాయనుకోలేదు టీచర్‌..  
టీచర్‌: ఆఁ..!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని