నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మార్కుల కోసమే..!

Published : 28 Oct 2023 01:26 IST

మార్కుల కోసమే..!

టీచర్‌: పిల్లలూ.. గణిత పరీక్షలో ప్రతి స్టెప్‌కి మార్కులు ఉంటాయి.. సరేనా?

విద్యార్థులు: అలాగే టీచర్‌..

టీచర్‌: నువ్వేంటి బంటీ.. సమాధానాలు రాయకుండా, ఏవో బొమ్మలు గీస్తున్నావు?

బంటి: మీరే కదా టీచర్‌.. ప్రతి స్టెప్‌కి మార్కులు ఉంటాయన్నారు.. అందుకే డాన్స్‌ స్టెప్స్‌ గీస్తున్నా..!

టీచర్‌: ఆఁ..!


అలా రాశా..!

కిట్టు: హోంవర్క్‌ పూర్తి చేశావా చంటీ..?

చంటి: హా.. ఎప్పుడో చేసేశా..!

కిట్టు:అదేంటి.. అంత తొందరగా ఎలా చేశావు?

చంటి: మా అమ్మానాన్న ఊరి నుంచి వచ్చేశారు కిట్టూ..

కిట్టు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని