నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 31 Oct 2023 00:10 IST

అందుకే..!

చింటు: చంటీ.. నీకు తినే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉందా?

చంటి: లేదు చింటూ..!

చింటు: ఎందుకని?

చంటి: మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది కాబట్టి..

చింటు: ఆఁ..!

అలా ఎలా..?

కిట్టు: అన్నయ్యా.. నువ్వు ఓ విషయంలో ఫెయిల్‌ అయ్యావు తెలుసా..?

బన్ని: నాకు తెలియకుండానా.. ఎందులో కిట్టూ..!

కిట్టు: నాతో హోంవర్క్‌ చేయించడంలో.. అన్నీ తప్పులే రాశానని టీచర్‌ తిట్టారు.. అప్పుడు నాతోపాటు నువ్వూ ఫెయిల్‌ అయినట్టే కదా..!

బన్ని: ఆఁ..!

భలే చెప్పాడు..

టిల్లు : అమ్మా.. నువ్వు, నాన్న నాకు చాలా రుణపడి ఉండాలి..

అమ్మ : ఏం ఎందుకలా?

టిల్లు : నేను ఇంకెక్కడో పుట్టి ఉంటే, మీరు నాకోసం ఎంత వెతకాల్సి వచ్చేదో కదా..

అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని