నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటి: కిట్టూ.. ఒకటి అడుగుతా.. చెప్పు? కిట్టు: అడుగు చంటీ..

Updated : 01 Nov 2023 01:07 IST

అందుకే మరి..!

చంటి: కిట్టూ.. ఒకటి అడుగుతా.. చెప్పు?
కిట్టు: అడుగు చంటీ..

చంటి: చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయెందుకు?
కిట్టు: అంతేనా.. ఎందుకంటే వాటికి ప్రతిరోజు తలస్నానం చేయడం ఇష్టం కాబోలు.!

చంటి: ఆఁ..!


మమ్మల్నే అడుగుతారు..!

అమ్మ: ఈ రోజు స్కూల్‌ ఎలా గడిచింది బంటీ..!
బంటి: బాగానే ఉంది కానీ.. మా టీచర్‌ని మార్చమని ప్రిన్సిపల్‌కి చెప్పాలమ్మా..!
అమ్మ: ఎందుకని?

బంటి: ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పమని, టీచర్‌ మమ్మల్నే అడుగుతున్నారమ్మా..!
అమ్మ: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని