నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఎప్పుడో వచ్చు..!

Published : 02 Nov 2023 00:02 IST

ఎప్పుడో వచ్చు..!

కిట్టు: టీచర్‌ ఇచ్చిన హోంవర్క్‌ చేసేశావా బిట్టూ..!

బిట్టు: ఓ.. ఎప్పుడో చేసేశా..

కిట్టు: అదెలా? మనం ఇప్పుడేగా స్కూల్‌ నుంచి వచ్చింది..!

బిట్టు: టీచర్‌ ఇంగ్లిష్‌ పుస్తకంలో 55 నుంచి 65 పేజీ వరకు చదవమన్నారు కదా.. ఆ నంబర్లు నాకు ఎప్పుడో వచ్చు..

కిట్టు: ఆఁ..!


అందుకేనేమో..!

చిన్ని: ఏంటి మిన్నీ.. అంతలా ఆలోచిస్తున్నావు?

మిన్ని: మరేం లేదు చిన్నీ.. మనుషులకు అన్ని రకాల బ్లడ్‌ గ్రూపులు ఎందుకుంటాయని..!

చిన్ని: ఒకే రక్తమైతే దోమలకు బోరు కొడుతుందని..!

మిన్ని: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని