నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: అమ్మా.. నేను టీవీ చూస్తూ హోంవర్క్‌ చేస్తానమ్మా..!

Updated : 07 Nov 2023 02:37 IST

టీవీ చూస్తూ..!

బంటి: అమ్మా.. నేను టీవీ చూస్తూ హోంవర్క్‌ చేస్తానమ్మా..!

అమ్మ: అలాగే బంటీ..

బంటి: థాంక్యూ అమ్మా.. టీవీ పెట్టు మరి..!

అమ్మ: టీవీ చూడటానికి పెట్టడం దేనికి? దాన్ని చూస్తూ ముందు హోంవర్క్‌ పూర్తి చెయ్యి..!

బంటి: ఆఁ..!

మంచి పేరు..!

చంటి: చింటూ.. ఈ మధ్య పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తున్నట్లున్నాయి?  

చింటు: అవును చంటీ.. బాగా చదివి, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా..

చంటి: ఇప్పుడు నీ పేరు బాగానే ఉంది కదా..!

చింటు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని