నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కిట్టు: బిట్టూ.. హోంవర్క్‌ పూర్తి అయిందా? బిట్టు: ఎప్పుడో కిట్టూ..!

Published : 17 Nov 2023 00:03 IST

అందుకే రాశా..!

కిట్టు: బిట్టూ.. హోంవర్క్‌ పూర్తి అయిందా?

బిట్టు: ఎప్పుడో కిట్టూ..!

కిట్టు: నువ్వు ఇంత తొందరగా రాయవు కదా?

బిట్టు: అందుకే నేను మా నాన్నతో నా హోంవర్క్‌ రాయించా.


మీరే చెప్పారు కదా..!

టీచర్‌: బంటీ.. ఏమీ రాయకుండా, ఆన్సర్‌ షీట్లన్నీ ఖాళీగా ఇచ్చావేంటి?

బంటి: మీరే కదా టీచర్‌.. పేపర్‌ నీట్‌గా ఉంటే రెండు మార్కులు వేస్తానన్నారు.. కనీసం అవైనా వస్తాయని.. ఏమీ రాయకుండా ఖాళీగా ఇచ్చాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని