నవ్వుల్‌.. నవ్వుల్‌...!

చిన్ని: ఏంటి మిన్నీ.. అలా సైలెంట్‌గా ఉన్నావు? మిన్ని: ఈరోజేం బాలేదు చిన్నీ.. ఈసారి కూడా పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి..

Published : 28 Nov 2023 00:34 IST

ఎప్పటి నుంచీ..?

చిన్ని: ఏంటి మిన్నీ.. అలా సైలెంట్‌గా ఉన్నావు?

మిన్ని: ఈరోజేం బాలేదు చిన్నీ.. ఈసారి కూడా పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి..

చిన్ని: బాధపడకులే.. నీకూ మంచి రోజులు వస్తాయి..

మిన్ని: అవునులే..

చిన్ని: అవునంటూ క్యాలెండర్‌ చూస్తావేంటి?

మిన్ని: అదే మంచిరోజులు ఎప్పటి నుంచి వస్తాయా.. అని చూస్తున్నా..!


అందుకే కోపం..!

అమ్మ: కిట్టూ.. ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది?

కిట్టు: బాగానే గడిచింది కానీ, మా టీచర్‌ మీద కాస్త కోపంగా ఉందమ్మా..!

అమ్మ: దేనికి?

కిట్టు:నేను ఏ పని చేసినా సపోర్ట్‌ చేస్తానన్నారమ్మా..!

అమ్మ: మంచిదే కదా? దానికెందుకు కోపం?

కిట్టు: కానీ.. క్లాస్‌లో నిద్రపోతే కొట్టారమ్మా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని