ఎవరెస్ట్ కన్నా నేనే ఎత్తు!
భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. కానీ నేను మీ ఎవరెస్ట్ కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎత్తుంటాను. నా పేరు ఒలంపస్ మోన్స్, నేనో అగ్నిపర్వతాన్ని. ‘అదేంటి?.. ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అయితే.. దాని కంటే ఎత్తైన పర్వతం మరోటి ఉందా? మరి స్కూల్లో మాకు ఎవ్వరూ చెప్పలేదే? మా సిలబస్‌లో కూడా లేదే’ అని ఆలోచిస్తున్నారు కదూ! నేను మీ ఎవరెస్ట్ కన్నా ఎత్తే.. కానీ నేను మీ భూమి మీద ఉండనుగా!
‘ఏంటీ.. భూమి మీద ఉండదా? మరి ఎక్కడ ఉంటుందిది’ అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? వద్దులెండి.. నేనే చెప్పేస్తా. నేను అంగారక గ్రహం మీద ఉంటాను. ‘ఓ.. అవునా... ఆ ముక్క ముందు చెప్పాలిగా’ అని మాత్రం అనకండి. ఎందుకంటే ముందే చెప్పేస్తే ఈ సస్పెన్స్ ఉండదుగా. మరి నా గురించి కొన్ని విశేషాలు క్లుప్తంగా చెబుతాను.. సరేనా!
అయ్ బాబోయ్ ఎంత పొడవో!
ఇంతకీ నా ఎత్తు ఎంతో చెప్పనే లేదు కదూ.. అంగారకగ్రహం ఉపరితలం నుంచి 72,000 అడుగులు. అంటే దాదాపు 21.9 కిలోమీటర్లు. నేను సౌరకుటుంబంలోనే అతిపెద్ద పర్వతాన్ని. అగ్నిపర్వతం లావా వల్ల నేను ఉద్భవించాను. అంగారకగ్రహం దక్షిణం వైపు ఉంటాను. మీకు నా ఎత్తు తెలిసింది సరే.. మరి నా చుట్టుకొలత ఎంతో తెలుసా? నేను దాదాపు మూడులక్షల కిలోమీటర్లను కవర్ చేస్తాను. అంటే దాదాపు ఇటలీ అంత ఉంటానన్నమాట.
అక్కడి వాతావరణమే కారణం
నేను అంత పెద్ద అగ్నిపర్వతంగా మారడానికి అంగారక గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులే కారణం. అందుకే అక్కడ లావా చాలా నెమ్మదిగా ప్రవహిస్తూ నేను ఏర్పడ్డాను. అలాగే అంగారకుడి పొరల లోతుల్లో ఉన్న ఖనిజాల మిశ్రమమూ కారణం అనుకోండి. ఫ్రెండ్స్.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఒక చిన్నమాట.. ఇక మీదట మిమ్మల్ని ఎవరైనా.. ‘అతి ఎత్తైన పర్వతం పేరేంటి?’ అని అడిగితే ‘భూమి మీద అయితే ఎవరెస్ట్, మొత్తం సౌరకుటుంబంలోనే అయితే ఒలంపస్ మోన్స్’ అని చెప్పండి సరేనా! ఇక ఉంటామరి బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’