మైరా సృష్టించిన చిన్ని సిటీ..!

హాయ్‌ నేస్తాలూ..! ప్రతిరోజూ స్కూల్‌ నుంచి వచ్చాక ఎంచక్కా ఆడుకుంటున్నారా? ఆటలు అంటే చాలు మనం ఎప్పుడూ ముందే ఉంటాం అంతే కదా..! ఇంతకీ మీకు లెగో బ్రిక్స్‌ తెలుసా? ‘హో.. మాకు చాలా బాగా తెలుసు.

Updated : 30 Jan 2024 01:26 IST

హాయ్‌ నేస్తాలూ..! ప్రతిరోజూ స్కూల్‌ నుంచి వచ్చాక ఎంచక్కా ఆడుకుంటున్నారా? ఆటలు అంటే చాలు మనం ఎప్పుడూ ముందే ఉంటాం అంతే కదా..! ఇంతకీ మీకు లెగో బ్రిక్స్‌ తెలుసా? ‘హో.. మాకు చాలా బాగా తెలుసు. మేము వాటితో అప్పుడప్పుడు ఆడుకుంటాం కదా. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు?’ అంటారా. ఓ చిన్నారి.. వాటితోనే ఒక చిన్ని అద్భుతాన్ని సృష్టించింది. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హారాష్ట్రలోని ముంబయికి చెందిన మైరా సురానకు తొమ్మిదేళ్లు. ప్రస్తుతం తను నాలుగో తరగతి చదువుతోంది. ఈ చిన్నారికి ఏవైనా కొత్తగా తయారు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అట. సాధారణంగా అయితే మనం లెగో బ్రిక్స్‌తో చిన్నచిన్న ఇళ్లు, జంతువులను తయారుచేస్తుంటాం. కానీ మన మైరా మాత్రం ఏకంగా ఒక మినీ సిటీనే ఏర్పాటు చేసింది.

ఆసక్తితో..

చిన్నప్పటి నుంచే తను లెగో బ్రిక్స్‌తో ఎక్కువగా ఆడుకునేదట. రకరకాల ఆకారాలు తయారుచేసేదట. అలా ఏర్పడిన ఆసక్తితోనే.. ఆమె మిని సిటీ ఆకారాన్ని సృష్టించింది. దాన్ని నిర్మించడానికి 112 లెగో సెట్స్‌ నుంచి మొత్తం.. 43222 బ్రిక్స్‌ని ఉపయోగించిందట. ఆ ఆకారం పొడవు 5.60 మీటర్లు. వెడల్పు 1 మీటరు. దాంతో పాటుగా తను రోబో ఆకారాలు, హోల్‌, గిటార్‌, ట్రీ హౌస్‌ తయారుచేసింది. వాటిని ముంబయిలోని ఓ రెస్టరంట్‌లో ప్రదర్శనకు పెట్టింది. ఆ ఆకారాలు చూసిన వాళ్లంతా మైరాను చాలా మెచ్చుకుంటున్నారు. ఇంతటి ప్రతిభ కనబర్చిన ఈ చిన్నారికి ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం దక్కింది. ఎంతైనా మైరా చాలా గ్రేట్‌ కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు