28 నిర్మాణ సంస్థలకు క్రియేట్‌ అవార్డులు

నిర్మాణ రంగంలో ఆస్కార్‌ అవార్డులుగా పరిగణించే క్రియేట్‌ (క్రెడాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ అవార్డ్స్‌ ఫర్‌ తెలంగాణ) అవార్డులను 2019 సంవత్సరానికి గాను 28 నిర్మాణ సంస్థలు అందుకున్నాయి. రెండేళ్లకోసారి ఇచ్చే ఈ అవార్డులను

Updated : 18 Jan 2020 02:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో ఆస్కార్‌ అవార్డులుగా పరిగణించే క్రియేట్‌ (క్రెడాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ అవార్డ్స్‌ ఫర్‌ తెలంగాణ) అవార్డులను 2019 సంవత్సరానికి గాను 28 నిర్మాణ సంస్థలు అందుకున్నాయి. రెండేళ్లకోసారి ఇచ్చే ఈ అవార్డులను కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) తెలంగాణ 2017లో ప్రవేశపెట్టింది. రెండో ఎడిషన్‌ అవార్డుల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. డిజైన్‌, నిర్మాణం తదితర విభిన్న విభాగాలలో అత్యుత్తమ ప్రమాణాలను కనబరిచిన ప్రాజెక్ట్‌లను గుర్తించి వాటిని చేపట్టిన సంస్థలను ప్రోత్సహించేందుకు అవార్డులను అందజేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని