మార్కెట్‌ స్థిరం.. భవిష్యత్తుపై విశ్వాసం

వచ్చే ఆర్నేళ్లు స్థిరాస్తి మార్కెట్‌ ఎలా ఉండబోతోంది? కొనుగోలుదారుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన 33వ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ సూచి ప్రకారం..

Updated : 23 Jul 2022 11:13 IST

సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు మాత్రం తగ్గుదల

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఆర్నేళ్లు స్థిరాస్తి మార్కెట్‌ ఎలా ఉండబోతోంది? కొనుగోలుదారుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన 33వ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ సూచి ప్రకారం.. భవిష్యత్తుపై బిల్డర్లలో సానుకూలత వ్యక్తమైంది. సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోర్‌ తగ్గినా.. మున్ముందు మార్కెట్‌ స్థిరంగా ఉంటుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఈ రంగంతో ముడిపడిన భాగస్వాములేమో జాగ్రత్త పడుతున్నారు.

* జూన్‌21 నుంచి జులై 5వరకు నిర్వహించిన సర్వేలో ప్రస్తుత సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు రెండో త్రైమాసికానికి 68 నుంచి 62కి తగ్గింది. దక్షిణాదిలో పెద్దగా మార్పు లేదు.

* ఆర్‌బీఐ రెండుసార్లు రెపో రెట్ల పెంపుతో గృహ రుణ వడ్డీరేట్లు పెరగడంతో ఆ మేరకు సెంటిమెంట్‌ తగ్గిందని నివేదికలో పేర్కొంది.

* ఇలాంటి పరిస్థితుల్లోనూ భవిష్యత్తు సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు 62గా నమోదవడంతో మార్కెట్‌ స్థిరంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తమైంది.

* సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది ఇళ్ల అమ్మకాలు వచ్చే ఆరునెలల్లో స్థిరంగా ఉంటాయని భావిస్తున్నారు.

* కార్యాలయాల అద్దెలు స్థిరంటా ఉంటాయని 47 శాతం మంది ఆశిస్తే, కార్యాలయాల లీజింగ్‌ స్థిరంగా ఉంటుందని 57 శాతం మంది భావిస్తున్నారు. 

జాగ్రత్తపడుతున్నారు.. 

రియల్‌ ఎస్టేట్‌ ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలతో భాగస్వాములు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పీఈ నిధులు వెచ్చించే సంస్థలు జాగ్రత్తపడుతున్నాయి.

* యూఎస్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, యూరోప్‌ వ్యవస్థ మందగమనంతో భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది. దీంతో నివాస మార్కెట్‌ దృక్పథం జాగ్రత్తను ప్రతిబింబిస్తోందని నివేదిక పేర్కొంది. 

బిల్డర్లు భరోసాతో.. భవిష్యత్తుపై నిర్మాణదారులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. బిల్డర్ల భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోర్‌ గత తైమాసికంలో 56 ఉంటే.. రెండో త్రైమాసానికి 61కి పెరిగింది. రాబోయే ఆరునెలలు మార్కెట్‌ బాగుంటుందనే విశ్వాసంతో ఉన్నారు.   


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని