బేసన్‌ ఖీర్‌!

సెనగపిండి- 50గ్రా, పంచదార- 100గ్రా, పాలు- పావులీటరు, కోవా- 50గ్రా, నెయ్యి- 50గ్రా, బాదంపప్పులు- రెండు....

Published : 27 Oct 2019 01:10 IST

పాఠక వంట

కావాల్సినవి: సెనగపిండి- 50గ్రా, పంచదార- 100గ్రా, పాలు- పావులీటరు, కోవా- 50గ్రా, నెయ్యి- 50గ్రా, బాదంపప్పులు- రెండు

తయారీ: పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని అందులో సెనగపిండిని వేసుకుని పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇందులోనే పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మంట తగ్గించుకుని ఇప్పుడు పాలను కొద్దికొద్దిగా పోస్తూ సెనగపిండి ఉండకట్టకుండా కలుపుకోవాలి. చివరిగా కోవా వేసి మరికాసేపు ఉడికించుకుని స్టౌ కట్టేయాలి. బాదం పప్పులతో అలంకరించుకుని తింటే రుచిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని