సొర పిట్టు

కావాల్సినవి: సొరచేప- కిలో, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, కారం- చెంచాన్నర, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచాన్నర, గరంమసాలా- చెంచా, కొబ్బరి- సగం చెక్క, నూనె- తగినంత, కొత్తిమీర- చిన్నకట్ట, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత

Published : 17 Nov 2019 00:55 IST

పాఠక వంట!

కావాల్సినవి: సొరచేప- కిలో, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, కారం- చెంచాన్నర, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచాన్నర, గరంమసాలా- చెంచా, కొబ్బరి- సగం చెక్క, నూనె- తగినంత, కొత్తిమీర- చిన్నకట్ట, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా చేప ముక్కలని వేడినీటిలో పావుగంటపాటు ఉడకబెట్టాలి. తర్వాత ముక్కలపై ఉండే చర్మం తీసేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొబ్బరికోరు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌, గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత సొర పిట్టు వేసి సన్నమంట మీద పావుగంట పాటు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని దింపుకొంటే సొరపిట్టు రుచిగా ఉంటుంది.

- సూర్యావతి, తూర్పుపాలెం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని