పెసర పునుగుల పులుసు

పెసర పునుగులు- పది, ఉల్లిపాయలు-రెండు, పచ్చిమిర్చి-నాలుగు, చింతపండు-నిమ్మకాయంత, వెల్లుల్లిరెబ్బలు-నాలుగు, జీలకర్ర-కొద్దిగా, నీళ్లు-రెండు కప్పులు, కొత్తిమీర-చిన్నకట్ట, పసుపు- పావుటీస్పూన్‌, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా.

Published : 22 Dec 2019 01:00 IST

పాఠక వంటకం!

కావాల్సినవి: పెసర పునుగులు- పది, ఉల్లిపాయలు-రెండు, పచ్చిమిర్చి-నాలుగు, చింతపండు-నిమ్మకాయంత, వెల్లుల్లిరెబ్బలు-నాలుగు, జీలకర్ర-కొద్దిగా, నీళ్లు-రెండు కప్పులు, కొత్తిమీర-చిన్నకట్ట, పసుపు- పావుటీస్పూన్‌, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా.

తయారీ: ముందుగా వెల్లుల్లి, జీలకర్రలను మెత్తగా పేస్టు చేసుకోవాలి. బాణలిలో నూనె పోసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి నిమిషం పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. ఇందులో చింతపండు పులుసు పోసి పది నిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు పెసర పునుగులు వేసి కూరను దించేయాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేయాలి.

- ఎం. ఆకాంక్ష, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు