వంకాయ, పాలకూర పచ్చడి

మధ్యస్థంగా ఉన్న వంకాయలు- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, పాలకూర- రెండు కట్టలు, పచ్చిమిర్చి- వంద గ్రాములు, జీలకర్ర- టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు....

Published : 15 Mar 2020 00:10 IST

పాఠక వంట

కావాల్సినవి: మధ్యస్థంగా ఉన్న వంకాయలు- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, పాలకూర- రెండు కట్టలు, పచ్చిమిర్చి- వంద గ్రాములు, జీలకర్ర- టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, నూనె- రెండు టీస్పూన్లు, చింతపండు-కొద్దిగా, ఉప్పు-తగినంత.

తయారీ: వంకాయలు, ఉల్లిపాయను ముక్కలుగా  కోసుకోవాలి. పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర వేయాలి. అది చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, వంకాయ ముక్కలు, పాలకూర, చింతపండు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పచ్చడి చేయాలి. రోట్లో కచ్చాపచ్చాగా నూరుకున్నా బాగుంటుంది. పచ్చడి కాస్త కారంగా ఉండాలంటేనే వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది.

- ఎస్‌. మంగమ్మ ఎమ్మిగనూరు, కర్నూలు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని