పెండలం పులుసు

పెండలం దుంప- ఒకటి, ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చి- నాలుగు, కారం- చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, జీలకర్ర- అరచెంచా, వెల్లుల్లి- మూడు రెబ్బలు, నూనె...

Published : 18 Aug 2019 00:14 IST

పాఠక వంట

కావల్సినవి: పెండలం దుంప- ఒకటి, ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చి- నాలుగు, కారం- చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, జీలకర్ర- అరచెంచా, వెల్లుల్లి- మూడు రెబ్బలు, నూనె- రెండు చెంచాలు, చింతపండు- నిమ్మకాయంత, కొత్తిమీర- కొద్దిగా
తయారీ: ముందుగా ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా, పచ్చిమిర్చిని పొడవాటి చీరికల్లా కోసుకోవాలి. పెండలం దుంప చెక్కు తీసి నీళ్లల్లో వేసి బాగా కడగాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి వేడయ్యాక నూనె పోసి.. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. చివరిగా పెండలం ముక్కలు వేసి కలిపి మూత పెట్టేయాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పసుపు, కారం వేసి ఇంకోసారి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాలపాటు  మగ్గాక చింతపండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మరగనివ్వాలి. కూర ఉడుకుతున్నప్పుడు వెల్లుల్లి, జీలకర్రని ముద్దగా చేసుకుని అందులో వేయాలి. దింపే ముందు కొత్తిమీర వేస్తే...మంచి రుచి వస్తుంది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని