ఔషధ గని... తుమ్మి!

తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో... వినాయక చవితి రోజు తుమ్మికూర తినాలని అంటారు. ఈ కూర వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

Published : 28 Aug 2022 00:23 IST

తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో... వినాయక చవితి రోజు తుమ్మికూర తినాలని అంటారు. ఈ కూర వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

* నోటిపూత వేధిస్తున్నప్పుడు... తుమ్మికూర కషాయాన్ని నోట్లో ఉంచి పుక్కిలించడం వల్ల పూత నుంచి ఉపశమనం కలుగుతుంది.
* వారంలో ఒక్కసారైనా తుమ్మికూరని తింటే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీనిని ఔషధంగా వాడతారు. మనమైతే పచ్చడి చేసుకుంటాం. పప్పులో వేసుకుంటాం. కానీ చైనా వంటి చోట్ల దీనిని దగ్గు నివారిణిగా వాడతారు. గాయాలకు పైపూతగా వేస్తారు. దీని నుంచి తీసిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని సహజ మస్కిటో రెపల్లెంట్‌గా వాడతారు.
* నెలసరిలో ఇబ్బందులున్నవారు తుమ్మికూరని తరచూ తినడం వల్ల నెలసరి సజావుగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని