రుచుల.. రంజాన్!
రంజాన్ అంటే వేడివేడి హలీమే గుర్తుకొస్తుంది.. మరి తీయని షీర్‌కుర్మా మాటేంటి? నోరూరించే బగారా దహీవడాని ఎప్పుడైనా రుచిచూశారా? ఇక ఫలఫెల్ గురించి కూడా తెలుసుకోవాలంటే వీటిని చదివేయండి..
రంజాన్ అంటే వేడివేడి హలీమే గుర్తుకొస్తుంది.. మరి తీయని షీర్‌కుర్మా మాటేంటి? నోరూరించే బగారా దహీవడాని ఎప్పుడైనా రుచిచూశారా? ఇక ఫలఫెల్ గురించి కూడా తెలుసుకోవాలంటే వీటిని చదివేయండి.. చేసేయండి..
షీర్ కుర్మా
కావల్సినవి:: పాలు- అర లీటరు, చక్కెర- 125 గ్రా, నెయ్యి- 3 చెంచాలు, జీడిపప్పు- 2 చెంచాలు, కిస్మిస్- పది, పిస్తా- 8, సారపప్పు పలుకులు- చెంచా, యాలకుల పొడి- చెంచా, పచ్చి ఖర్జూరం- 5, బాదం పప్పులు- 8, సన్న సేమ్యాలు- 100 గ్రా
తయారీ: ముందుగా జీడిపప్పు, బాదం, పచ్చి ఖర్జూరం వీటిని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసుకొని, వేడెక్కాక పాన్‌లో వేయించుకోవాలి. వీటితోపాటు కిస్మిస్, పిస్తా, సారపప్పు పలుకుల్ని కూడా దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే పాన్‌లో సేమియా వేసి ఒక నిమిషం వేయించుకుని, అందులో పాలు పోసుకొని ఐదు నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన పాలలో చక్కెర వేసుకొని చిక్కగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. ఈ షీర్ కుర్మా లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసుకొని వేడిగా వడ్డించుకోవాలి.
బగారా దహీ వడ
కావల్సినవి: సెనగపిండి- 150 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్- చెంచా, పసుపు- చిటికెడు, కారం- చెంచాన్నర, ఉప్పు- తగినంత, తినేసోడా - రెండు చిటికెలు, పెరుగు- నాలుగు కప్పులు, నూనె- వేయించడానికి సరిపడ, జీలకర్ర- చెంచా, ఎండుమిర్చి- 5, కరివేపాకు- రెమ్మ, పుదీనా తరుగు- 3 చెంచాలు, కొత్తిమీర తరుగు- 3 చెంచాలు
తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, తినే సోడా, రెండు కప్పుల నీళ్ళు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఇంకొక పాత్రలో పెరుగు, నాలుగు కప్పుల నీళ్ళు, కొద్దిగా వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొత్తిమీర, పూదీనా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో ఆయిల్ పోసుకొని వేడెక్కాక నానబెట్టిన సెనగ పిండి మిశ్రమాన్ని బజ్జీల్లాగా వేసుకొని బంగారు వర్ణంలోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వేడి బజ్జీలను పెరుగు మిశ్రమంలో వేసుకుని పావుగంటపాటు నానబెట్టుకోవాలి. ఒక పాన్‌లో చెంచా నూనె పోసుకొని వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి దానిని నానిన బగారా దహీ వడాలో వేసి వడ్డించుకోవాలి.
బాదం హల్వా
కావల్సినవి: బాదంపప్పు- 200గ్రా, చక్కెర- 100గ్రా, ఎల్లో ఫుడ్ కలర్- చిటికెడు, యాలకులపొడి- చెంచా, పాలు- 150 ఎం.ఎల్, నెయ్యి- 100 ఎం.ఎల్, రోజ్ వాటర్- అర చెంచా
తయారీ: ముందుగా వేడినీటిలో బాదం పప్పుని గంటపాటు నానబెట్టుకోవాలి. ఆ బాదం పప్పు పొట్టు తీసేసి గ్రైండర్లో వేసి, చక్కెర, యాలకులు వేసి రవ్వరవ్వగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్న బాదంపప్పుతో పాటు ఫుడ్‌కలర్ వేసుకొని 15 నుంచి 20 నిమిషాలపాటు చిన్నమంట మీద ఉంచాలి. నెయ్యిపైకి తేరే వరకూ ఉంచి రోజ్‌వాటర్ వేసి చల్లారాక గార్నిష్ చేసి. వడ్డించుకోవాలి
ఫలఫెల్
కావల్సినవి: నానబెట్టుకొన్న కాబూలీ సెనగలు- కప్పు, ఉల్లిపాయ- 1, వెల్లుల్లి- 1, కొత్తిమీర తురుము- చెంచాన్నర, పుదీనా తురుము- చెంచా, ధనియాల పొడి- చెంచా, జీరాపొడి- చెంచా, మిరియాల పొడి- 1/4చెంచా, నూనె- తగినంత, గరంమసాలా- చెంచా, ఉప్పు- తగినంత, తినేసోడా- పావు చెంచా, మైదా - రెండు చెంచాలు, నిమ్మకాయ- అరచెక్క
తయారీ: ముందుగా బ్లెండర్‌లో నానబెట్టుకున్న కాబూలీ చనాతో పాటు వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మరసం , జీరా పొడి, ధనియాలపొడి, మిరియాలపొడి, కారం, గరం మసాలపొడి, తినేసోడా వేసి మెత్తగా రుబ్బు కోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్‌లో కరకరలాడేలా వేయించుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోవాలి.
విజయకుమార్ భట్ హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
Crime News
Hayathnagar: రాజేష్ శరీరంపై ఎలాంటి గాయాల్లేవు.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
-
Movies News
Allu Aravind: మా వల్ల పైకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారు.. ఆ ఒక్క దర్శకుడే మాటకు కట్టుబడ్డాడు!
-
General News
Indian Railway-Kishan Reddy: కిషన్‌రెడ్డి చొరవ.. తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్
-
Politics News
KTR: భాజపా, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి: మంత్రి కేటీఆర్
-
Sports News
Ruturaj Gaikwad: రెండు రోజుల్లో పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఫియాన్సీ ఎవరంటే..?